● ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలు...
చాపాడు మండలంలో ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఇటీవల బీజేపీ మండలశాఖ అధ్యక్షుడు ఎల్‌సీ గోపాల్‌రెడ్డి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సామాన్యులకు అందించాల్సిన రేషన్ బియ్యం పంపిణీ, తూకంలో అక్రమాలకు పాల్పడుతున్నారని వాపోయారు. ప్రధానంగా రేషన్‌షాపు డీలర్లు టీడీపీ నేతలే ఉన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా మాఫియా సైతం మైదుకూరు నియోజకవర్గంలో తిష్ట వేసి ఉంది. అందులో దువ్వూరు మండలంలోని టీడీపీ వర్గీయుడు గిరియాదవ్ పోలీసులకు సైతం పట్టుబట్టారు. చిన్నసింగనపల్లెకు చెందిన మరో టీడీపీ వర్గీయుడు ఏకంగా డిప్యూటీ తహశీల్దార్ స్థాయి అధికారిపై బెదిరింపులకు దిగారు.
● అంతేనా టీడీపీ నేతలు భూ ఆక్రమణలకూ తెరతీశారు. ఏకంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం ఉల్లంఘిస్తూ చెరువులను చెరబట్టారు. వంకలను ఆక్రమించుకున్నారు. ప్రభుత్వ, పరంబోకు భూములు స్వాహా అవుతోన్నాయి. ఇవన్నీ కూడా తెలుగుతమ్ముళ్లు నేతృత్వంలో తెరపైకి వస్తున్నాయి. ఇంకోవైపు ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. అవే విషయాలు పత్రికల్లో పతాక శీర్షికన కథనాలు వచ్చాయి. చిత్తశుద్ధి ఉంటే ప్రజాప్రతినిధిగా పుట్టా సుధాకర్‌యాదవ్ స్పందించాలి కదా... కట్టడి చేయాలి కదా... అంటూ విపక్ష పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment