భూముల రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలి
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో భూముల రీసర్వే వేగవంతంగా పకడ్బందీగా నిర్వహించి నివేదికలు సమర్పించాలని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. బుధవారం విజయవాడ నుంచి భూముల రీ సర్వేపై అదనపు సీసీఎల్‌ఏ నక్కల ప్రభాకర్ రెడ్డితో కలిసి సీసీఎల్‌ఏ జయలక్ష్మి అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీసీఎల్‌ఏ జయలక్ష్మి మాట్లాడుతూ జిల్లాల్లో భూముల రీ సర్వే పై ప్రత్యేక శ్రద్ధ వహించి పకడ్బందీగా నిర్వహించాలని, నివేదికలు పంపాలన్నారు. ఆ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై క్షేత్ర స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. భూముల రిసర్వే ప్రక్రియ రెవెన్యూ శాఖలో అతి ముఖ్యమైన అంశమని అన్నారు. ఎలాంటి జాప్యం, నిర్లక్ష్యం వహించరాదన్నారు. సీసీఎల్‌ఏ వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం కడప కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాల్ లో జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ సంబంధిత అధికారులతో మాట్లాడారు. ప్రజలకు పౌర సేవలు సంతృప్తి స్థాయిలో అందాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు ప్రతి ఒక్క రూ నిబద్ధతతో పనిచేయాలన్నా రు. రెవెన్యూ శాఖలో ఎక్కడా కూడా పెండింగ్ అంశాలు లేకుండా చూడాలన్నారు. భూ రికార్డు లను సంతృప్తి కరంగా ఏలాంటి లోటుపాట్లను లేకుండా అప్డేట్ చేయాలన్నారు. ఇందుకు ఆయా తహసీల్దార్, వీఆర్‌ఓలు బాధ్యత వహించాలని అన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చిత సమాధానం ఇవ్వాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు, సర్వే ల్యాండ్ అధికారి, రెవెన్యూ అధికారులు, పాల్గొన్నారు.
భూ సమస్యలను పరిష్కరించాలి
కాశినాయన:రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జేసీ అదితిసింగ్ పేర్కొన్నారు. బుధవారం తహసీల్దారు కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా వీఆర్‌ఓలు, సర్వేయర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలన్నారు. బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్, తహసీల్దారు నరసింహులు, ఆర్‌ఐ అమర్‌నాఽథ్ రెడ్డి పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ అదితిసింగ్
Comments
Please login to add a commentAdd a comment