పటిష్టంగా శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు
కలెక్టర్ చెరుకూరి శ్రీధర్
పెండ్లిమర్రి: పొలతల శైవ క్షేత్రంలో మహాశివ రాత్రి పర్వదినం సందర్భంగా ఈనెల 25 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు సంబంధించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు పక్కాగా చేయాలని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ ఆశోక్ కుమార్ పేర్కొన్నారు. పొలతల క్షేత్రంలోని పర్యాటక భవనంలో బుధవారం సాయంత్రం ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులకు సమావేశం నిర్వహించారు. ముందుగా అధికారులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్ర త్తలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పార్కింగ్ స్థలాన్ని పెంచి వచ్చిన వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయించాలన్నారు. అలాగే ఘాట్‌ల వద్ద బారికేడ్‌లు ఏర్పాటు చేయించాలన్నారు. ముఖ్యంగా తాగు నీటికి ఇబ్బందులు రాకుండా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసర సేవలకు 108 అంబులెన్స్ వాహనాలు అందుబాటులో ఉంచాలన్నారు. రోడ్డు మరమ్మతుల పనులు త్వరగా పూర్తి చేయించాలని అధికారులకు అదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ విశ్వేశ్వర నాయుడు, కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, ఈఓ కృష్ణానాయక్, జిల్లా పంచాయతీ రాజ్ అధికారిని రాజ్యలక్ష్మి, తహశీల్దార్ అనురాధ, ఎంపీడీఓ జగన్‌మోహన్‌రెడ్డి,ఆర్టీసీ, అటవీ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment