చికెన్, గుడ్లను నిర్భయంగా తినొచ్చు
● జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి డాక్టర్ శారదమ్మ
కడప అగ్రికల్చర్: జిల్లాలో బర్డ్‌ప్లూ లేదని మాంస ప్రియులు చికెన్, గుడ్లను బాగా ఉడికించుకుని నిర్భయంగా తినొచ్చని జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి డాక్టర్ శారదమ్మ సూచించారు. బుధవారం నగరంలోని రాజీమార్ మార్గ్‌లో కలెక్టర్ ఆదేశానుసారం బర్డ్‌ప్లూపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బర్డ్‌ప్లూపై వస్తున్న వదంతాలను ఎవరు నమ్మొద్దన్నారు. జిల్లాలో ఎక్కడ బర్డ్‌ప్లూ లేదన్నారు. ఈ విషయమై జిల్లాలో రాపిడ్ రిస్కు టీమ్స్‌ను ఏర్పాటు చేసి ప్రతి మండలంలో ప్రజలకు సూచనలు, సలహాలను ఇస్తున్నామని వివరించారు. అనంతరం చికెన్ లాలిపాప్స్‌ను తెప్పించి పశువైద్యాధికారులు తినడంతోపాటు అక్కడకు హాజరైన జనాలకు తినిపించారు. జిల్లాలోకి చనిపోయిన కోళ్లు సరఫరా కాకుండా ఉండటానికి మార్కెటింగ్, ట్రాన్స్‌పోర్టు, మైనింగ్, పోలీసు చెక్ పోస్ట్ వారికి గట్టి ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అఽధికారి అయితా నాగేశ్వరావు, పీవీపీ ఏడీలు రంగస్వామి, సుబ్బరాయుడు, పశువైద్యాధికారి డాక్టర్ అనుపమ, జేవీఓ రాజశేకర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment