హంస వాహనంపై శ్రీరంగనాథుడు
పులివెందుల టౌన్: పులివెందుల పట్టణంలో పూలంగళ్ల సర్కిల్ వద్ద ఉన్న శ్రీరంగనాథుని కాంప్లెక్స్‌లో ప్రాచీన దేవాలయమైన శ్రీరంగ నాథ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు బుధవారం రాత్రి శ్రీరంగనాథ స్వామి హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పగలు శ్రీర ంగనాథస్వామికి ఆలయ ప్రదాన అర్చకులు కృష్ణరాజేష్‌శర్మ విజేష పూజలు జరిపించారు. చక్రస్నానం చేయించారు. శ్రీరంగనాథస్వామిని ప్రత్యేకంగా అలంకరించి హంసవాహనంపై పురవీధుల గుండా ఊరేగించారు. స్వామి వారికి భక్తులు కాయ కర్పూరాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి పులివెందుల వాల్మీకి నాట్యమండలి వారిచే సత్యహరిశ్చంద్ర పూర్తి నాటక ప్రదర్శన నిర్వహించారు. పెద్దసంఖ్యలో సందర్శకులు వచ్చి తిలకించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సుధీకర్‌రెడ్డి, ఈఓ కెవి రమణలు, సభ్యులు పాల్గొన్నారు.
ముగిసిన బ్రహ్మోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment