ఘనమైనది కడప ఉర్దూ సాహితీ చరిత్ర
కడప ఎడ్యుకేషన్ : భారతీయ సంస్కృతి సాహిత్యాలలో ఉర్దూ భాషకు ప్రత్యేక గుర్తింపు ఉందని ప్రత్యేకించి కడప ఉర్దూ సాహితీ చరిత్ర ఘనమైందని యోగి వేమన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ అన్నారు. యోగి వేమన యూనివర్సిటీ ఉర్దూ విభాగ అధిపతి ఆచార్య కె.రియాజున్నీసా ఆధ్వర్యంలో శనివారం ‘కడపలో ఉర్దూ సాహిత్యం’అనే అంశంపై జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సెమినార్‌కు ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ హాజరై మాట్లాడుతూ ఉర్దూ సాహిత్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. రెండవ భాష ఉర్దూ అమలు చేస్తున్న రాష్ట్రాల్లో యూపీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయన్నారు. ఉర్దూ భాష సారాంశంలో ప్రేమ, సోదర భావం, శాంతి సామరస్యం, జాతీయ సమైక్యత ఇమిడి ఉందన్నారు. ఉర్దూ సాహిత్యం గాలిబ్, ఇక్బాల్ లాంటి మహోన్నత కవులను ఆదరించిందని తెలిపారు. సూఫీజాన్ని అమీర్ కుస్రో బోధించారని, వేమన, ఇక్బాల్ భావాలు ఒకటేనని ఉదహరించారు. ఉర్దూ సాహిత్యంలో ఆధ్యాత్మిక చింతన ఉందని, సి. నారాయణరెడ్డి గజల్ ప్రక్రియను తెలుగు సాహిత్యానికి పరిచయం చేశారన్నారు. గౌరవ అతిథి వై వి యు హ్యూమానిటీస్ విభాగ డీన్ ఆచార్య కంకణాల గంగయ్య మాట్లాడుతూ సాహిత్యం సామాజిక వాస్తవికతకు అద్దం పట్టాలన్నారు. ప్రస్తుత పరిపాలన విధానాలపై విశ్లేషించారు. మాజీ కులసచివులు ఆచార్య నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ఉర్దూ కడప జిల్లా సాహిత్యం గురించి వివరించారు. చైన్నె ఉర్దూ ప్రొఫెసర్ డాక్టర్ సయ్యద్ సజ్జాద్ హుస్సేన్ మాట్లాడుతూ జాతీయ సదస్సు ద్వారా ఉర్దూ సాహిత్యానికి ప్రయోజనం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉర్దూ భాషా వికాసానికి అందరూ కృషి చేయాలని కోరారు. గౌరవ అతిధి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉర్దూ విభాగం అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎ.ఎం.ఫజులుల్లా మాట్లాడుతూ సెమినార్ అంశం అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. విశ్వవిద్యాలయంలో సాహితీ ప్రక్రియల గురించి సమావేశాలు నిర్వహించాలని తద్వారా ఎన్నో కొత్త విషయాలు వెలుగుచూస్తాయన్నారు. కర్నూల్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ విశ్రాంత రిజిస్ట్రార్ డాక్టర్ సత్తార్ సాహిర్ మాట్లాడుతూ కర్నూలు కడప గుంటూరులోని యూనివర్సిటీలు ఉర్దూ సాహిత్య అభివృద్ధికి కృషి చేస్తున్నాయన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఖాసిం అలీ ఖాన్ , ఉర్దూ విభాగ అధిపతి ఆచార్య కె.రియాజున్నీసా మాట్లాడారు. పరిశోధకులు ఆచార్య పజూలుల్లా, హుసేని బాషా షహమీరి, డాక్టర్ వసీవుల్లా భక్తియారి, డాక్టర్ సాజియా బేగం, డాక్టర్ ఇక్బాల్ కుస్రో ఖాద్రి, డాక్టర్ ఫైజల్లాహ్, డాక్టర్ కే ఇంతియాజ్, ఖాదర్ ఖాన్ డెల్టాకు, సత్తార్ ఫైజి, అన్వార్ హాజీ, సర్తాజ్ బేగం, మహబూబ్ ఖాన్, షేక్ ఆలియా, ఉర్దూ సాహిత్యం పై పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా వైవీయూ ఉర్దూ శాఖ తరఫున అతిథులను సత్కరించారు.
వైవీయూ రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ
ఘనమైనది కడప ఉర్దూ సాహితీ చరిత్ర
Comments
Please login to add a commentAdd a comment