పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తాం
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లా సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని, వాటి విలువలు అందరికీ తెలిపే విధంగా ప్రసిద్ధ ప్రదేశాలు ఆలయాలను కలుపుతూ పర్యాటక సర్క్యూట్ గా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. మంగళవారం భారత జాతీయ కళా సంస్కతి వారసత్వ పరిరక్షణ సంస్థ (ఇంటాక్) జిల్లా చాఫ్టర్ కన్వీనర్ లయన్ కె.చిన్నపరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన ఇంటాక్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పురాతన కట్టడాలు, కళలు, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక అంశాలపై జిల్లా సంస్కృతి గొప్పదనాన్ని తెలిపే విధంగా ఏడాదిలో నాలుగు రకాల ఉత్సవాలను జరిపే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. ఇందులో కడపోత్సవాలు, గండికోట ఉత్సవాలు, పురాతన వారసత్వ ఉత్సవాలు , గుడి సంబరాలు వంటివి ఉండాలని సూచించారు. జిల్లాలో ఉన్న టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేసే విధంగా టూరిజం సర్క్యూట్ ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న జానపదాలు, సాహిత్యాలు, కళలు, ఫోక్ డాన్సులు వంటి వాటిపై విద్యార్థుల్లో అవగాహన పెంచాలన్నారు. ఇంటాక్ కన్వీనర్ చిన్నపరెడ్డి మాట్లాడుతూ గండికోట వరల్డ్ హెరిటేజ్ గా యునెస్కో గుర్తింపుకోసం కృషి చేస్తున్నామని.. ఇందుకు జిల్లా యంత్రాంగ సహాయ సహకారాలు అందించాలని కోరారు. జిల్లా పర్యాటక శాఖ ఇంచార్జీ అధికారి సురేష్ కుమార్, టూరిజం మేనేజర్ రామ్ కుమార్,ఇంటాక్ సభ్యులు పాల్గొన్నారు.
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే
గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు
ప్రభుత్వ నిబంధనలకు లోబడే గ్యాస్ సిలిండర్లను వినియోగదారులకు సరఫరా చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు హెచ్చరికలు జారీచేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌లో హాలులో జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో జేసీ అదితిసింగ్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్ సరఫరాపై ప్రభుత్వానికి వినియోగదారుల నుంచి అసంతృప్తికరమైన సందేశాలు అందాయన్నారు. గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్లను ఇంటికి సరఫరా చేసే సమయంలో డెలివరీ బాయ్స్ అదనపు చార్జీలను వినియోగదారుల నుండి వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు అందడంపై ప్రభుత్వం సీరియస్ గా పరిగణించిందన్నారు. జిల్లాలో అదనపు చార్జీల వసూళ్లకు పాల్పడుతున్న 15 ఏజెన్సీలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే గ్యాస్ ఏజెన్సీలపై కఠినంగా వ్యవహరిస్తామని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి డీఎస్‌ఓ రెడ్డి చంద్రిక, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు, పాల్గొన్నారు.
కలెక్టర్ శ్రీధర్
Comments
Please login to add a commentAdd a comment