సనాతన ధర్మం అంటూ కూల్చివేయడం తగదు
కాశినాయన : సనాతన ధర్మం అంటూ ఆశ్రమాల్లో కూల్చివేతలు తగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల పేర్కొన్నారు. కాశినాయన మండలం జ్యోతిక్షేత్రంలోని కాశినాయన ఆశ్రమంలో కూల్చివేసిన కట్టడాలను ఆమె మంగళవారం పరిశీలించారు. అటవీశాఖ అధికారులు కూల్చివేసిన సాన్నపు గదులు, విశ్రాంతి గదులు, గోశాల, క్షౌ రశాలను ఆమె పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎంతో మంది అనాథలకు, నిరాశ్రయులకు అన్నం పెట్టే కాశినాయన ఆశ్రమాన్ని కూల్చివేయడం బాధాకరమన్నారు. సనాతన ధర్మం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ హనుమంతరెడ్డి, జిల్లా సెక్రటరీ యాక్టివ్ కన్వీనర్ ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పోలిరెడ్డి, యూత్ నాయకుడు ప్రతాప్‌రెడ్డి, గొంటువారిపల్లె సర్పంచ్ పిచ్చిరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల
Comments
Please login to add a commentAdd a comment