ప్రొద్దుటూరు క్రైం : స్థానిక విజయనగరం వీధిలోని ఫ్లోరెన్స్ హాస్పిటల్‌ను వైద్యాధికారులు సీజ్ చేశారు. జనరల్ ఫిజీషియన్‌కు మాత్రమే ఈ హాస్పిటల్‌కు ప్రభుత్వ అనుమతి ఉంది. అయితే ఇటీవల ఇక్కడ కాన్పులు, సిజేరియన్లు నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు వెళ్లడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శివప్రసాద్‌రెడ్డి సిబ్బందితో కలిసి ఫ్లోరెన్స్ హాస్పిటల్‌కు వెళ్లారు. హాస్పిటల్‌లోని డాక్టర్ సాయిప్రసాద్‌తో మాట్లాడారు. అయితే ఇక్కడ జరిగే ప్రసవాల గురించి తనకు తెలియదని ఆయన వైద్యాధికారులకు తెలిపారు. హాస్పిటల్‌లోని సిబ్బందితో కూడా మాట్లాడారు. గైనకాలజీకి అనుమతి లేకున్నా ఎలా ప్రసవాలు చేస్తారని ప్రశ్నించారు. పూర్తి నివేదికను కలెక్టర్, డీఎంహెచ్‌ఓలకు పంపిస్తామని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తెలిపారు. తర్వాత సిబ్బంది అందరిని బయటికి పంపించి హాస్పిటల్‌ను సీజ్ చేశారు. విషయం తెలుసుకున్న జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ ఫ్లోరెన్స్ హాస్పిటల్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డెమో భారతి, దేవాంగపేట మెడికల్ ఆఫీసర్ ఆలిమ్, హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
వారాహి హాస్పిటల్‌ను పరిశీలించిన ఆర్డీఓ సాయిశ్రీ
జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ మంగళవారం ప్రొద్దుటూరులోని వారాహి హాస్పిటల్‌ను పరిశీలించారు. ఇటీవల ఈ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ పసికందు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే హాస్పిటల్ వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా తమ బిడ్డ మృతి చెందాడని దంపతులు ఆరోపించిన నేపథ్యంలో పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీంతో ఆర్డీఓ హాస్పిటల్‌కు వచ్చారు. అయితే ఆ సమయంలో హాస్పిటల్ వైద్యులు అందుబాటులో లేరు. పసికందు మృతి, హాస్పిటల్ అనుమతుల గురించి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శివప్రసాద్‌రెడ్డిని అడిగారు. పసికందుకు అందించిన చికత్సపై విచారణ చేస్తామని ఆయన ఆర్డీఓతో అన్నారు. తర్వాత బాధిత పసికందు తల్లిదండ్రులతో మాట్లాడారు.
అనుమతి లేకుండా
కాన్పులు చేస్తున్నారని ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment