పర్యవేక్షణ లోపమే విద్యార్థిని ఆత్మహత్యకు కారణం
జమ్మలమడుగు : హాస్టల్ వార్డన్ ప్రభావతి, అక్కడ వంట మనిషిగా పని చేస్తున్న ప్రసన్నల వికృత చేష్టలే డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న అక్షిత (18) మరణానికి ప్రధాన కారణమని పోలీసుల విచారణలో తేటతెల్లమైంది. దీంతో వార్డన్ ప్రభావతిని సస్పెండ్ చేయగా వంట మనిషిగా ఉన్న ప్రసన్నను అవుట్ సోర్సింగ్ ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలోనూ ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థినులు..
గత ఏడాది నవంబర్‌లో ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. అప్పట్లో అధికారులు వారి వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్యలకు యత్నించినట్లు తప్పుడు నివేదిక ఇవ్వడం వల్లే తిరిగి ఇలాంటి సంఘటన జరిగిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. హాస్టల్ వార్డన్, వంట మనిషి వసతి గృహంలో ఉంటున్న విద్యార్థినులను తమ స్వలాభాలకు ఉపయోగించుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వంట మనిషి ఆడపిల్లలను అర్థరాత్రి పూట బయటకు పంపిస్తోందని స్థానికులు చెప్పినా వార్డన్ పట్టించుకోలేదనే విమర్శలు వినవస్తున్నాయి.
అక్షిత కుటుంబానికి న్యాయం చేయాలి
ఆత్మహత్య చేసుకున్న అక్షిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలంటూ ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో తప్పుడు నివేదిక ఇచ్చిన ఏఎస్‌డబ్ల్యూఓ గురుప్రసాద్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నారు.
పోలీసుల విచారణలో
వెలుగు చూసిన వాస్తవాలు
Comments
Please login to add a commentAdd a comment