రాజకీయ కక్షతోనే నిప్పంటించారు
ప్రొద్దుటూరు : స్థానిక పాత బస్టాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అయిన కొండారెడ్డి, సుధాకర్ షాపులు దగ్ధం కావడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కేవలం రాజకీయ కక్ష సాధింపే ఈ సంఘటనకు కారణమని భావిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యర్తలు కొండారెడ్డి, సుధాకర్ పాతబస్టాండ్‌లో షాపులు నిర్వహిస్తున్నారు. కొండారెడ్డి కూల్ డ్రింక్ షాపు, సుధాకర్ ఫ్యాన్సీ స్టోర్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఊహించని రీతిలో శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఇరువురి దుకాణాలు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ నెల 12న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరిగిన యువత పోరు కార్యక్రమానికి కొండారెడ్డి కార్యకర్తలతో కలసి వాహనాల్లో కడపకు వెళ్లారు. ఈ కారణంగానే వీరి షాపులకు నిప్పు అంటించారని తెలుస్తోంది. శనివారం మున్సిపల్ వైస్ చైర్మన్లు ఆయిల్ మిల్ ఖాజా, పాతకోట బంగారు మునిరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి, కౌన్సిలర్ చింపిరి అనిల్ కుమార్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు ద్వార్శల గురునాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
పాత బస్టాండ్‌లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల షాపులు దగ్ధం
Comments
Please login to add a commentAdd a comment