
ఆరోగ్య శాఖలో పదోన్నతులు కల్పించండి
కడప కార్పొరేషన్ : వైద్య ఆరోగ్య శాఖలో అన్ని కేడర్లలో ఉన్న ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే. అహరోను కోరారు. శనివారం వైద్య,ఆరోగ్య సంచాలకులు డా. బి.రామ గిడ్డయ్యకు వారు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప జోన్‌లోని అనంతపురం, చిత్తూరు, కర్నూలు వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, పదోన్నతుల్లో జాప్యాన్ని నివారించాలని కోరారు. అన్ని కేడర్ల సీనియారిటీ జాబితాలను వెంటనే విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించాలన్నారు. ఈ మేరకు ముందస్తుగా జాబితాలను విడుదల చేయాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి గుర్తింపు సంఘాలతో సమావేశం నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ బాలక్రిష్ణ, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు లక్ష్మి నారాయణ, కర్నూలు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరసింహులు, సంపత్ కుమార్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు షేక్ బాబా సాహెబ్, కడప జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసుల రెడ్డి, బాషా, వీరేంద్ర రామసుబ్బారెడ్డి, శ్రీనివాస్ యాదవ్ లు పాల్గొన్నారు.
పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్
యూనియన్ డిమాండ్