ఘనంగా గోవిందమాంబ ఆరాధన ఉత్సవాలు
బ్రహ్మంగారిమఠం : కాలజ్ఞాన ప్రభోదకర్త పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ధర్మపత్ని మాతా గోవిందమాంబ ఆరాధన మహోత్సవం సోమవారం బ్రహ్మంగారిమఠంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు అభిషేకాలు, హోమాలు, ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రామస్వామి ఆధ్వర్యంలో దాదాపు 200 మంది మహిళలు అమ్మవారికి చీరె, సారెను అందించారు. ప్రత్యేక భజనలు, అన్నదానం కార్యక్రమాలు చేపట్టారు. రాత్రి వీరబ్రహ్మేంద్ర, గోవిందమాంబ సమేత ఉత్సవ గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ ఆధ్వర్యంలో మేనేజర్ ఈశ్వరాచారి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వపు మఠాధిపతి కుమారులు వెంకటాద్రిస్వామి, వీరభద్రస్వామి, దత్తస్వామి, మఠాధిపతి తమ్ముడు వీరభద్రస్వామి, దేవస్థాన సిబ్బంది, పుర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా గోవిందమాంబ ఆరాధన ఉత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment