● జిల్లా ఫ్యాప్టో నూతన కార్యవర్గం ఎన్నిక
● జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్‌గా ఇలియాస్ బాష
కడప ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తామని జిల్లా నూతన ఫ్యాప్టో చైర్మెన్ ఇలియాస్‌బాష పేర్కొన్నారు. కడపలోని వీణా విజయరామరాజు ఎస్టీయూ భవన్‌లో మాదన్ విజయ్‌కుమార్ అధ్యక్షతన ‘ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో)’ వైఎస్‌ఆర్ కడప జిల్లా నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా జిల్లా ఫ్యాప్టో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య (ఫ్యాప్టో) జిల్లా చైర్మన్‌గా ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్.ఎం.డి ఇలియాస్ బాషా(ఎస్టీయూ), సెక్రటరీ జనరల్‌గా ఆర్.అబ్దుల్లా (ఏ.పీ.టీ.ఎఫ్. 1938),ఆర్థిక కార్యదర్శిగా వి.వి శ్రీనివాసులు రెడ్డి (ఏ.పీ.టీ.ఎఫ్. 257), కో చైర్మన్‌లుగా జి.వి సుబ్బారెడ్డి (హెచ్.ఎమ్.ఏ), జె.రామచంద్రబాబు (బి.టి.ఎ),ఎం.జుబైర్ అహ్మద్ (రూటా) లు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా ఎం.విజయకుమార్ (యూటీఎప్), వి.శ్యామలా దేవి (ఆప్టా)లను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు పరిశీలకులుగా ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లు రఘునాథరెడ్డి వ్యవహరించారు. మల్లు రఘునాథ రెడ్డి మాట్లాడుతూ ఈ నూతన కార్యవర్గం రెండేళ్ల పాటు కొనసాగుతుందని తెలిపారు.
సైబర్ నేరాలపై అవగాహన
కడప అర్బన్ : సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసు అధికారులు శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ ఆదేశాలతో సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ మధుమల్లేశ్వర రెడ్డి, చిన్న చౌకు సీఐ ఓబులేసు, ఎస్.ఐ రాజరాజేశ్వర రెడ్డి, సైబర్ క్రైమ్, ఏ.ఆర్ సిబ్బంది నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా విస్తృతంగా అవగాహన కల్పించారు. కడపలోని చిన్న చౌకు పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన ర్యాలీ అప్సర సర్కిల్, వై జంక్షన్, డా.అంబెడ్కర్ సర్కిల్ మీదుగా వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. సైబర్ నేరం జరిగిన తక్షణమే 1930 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పోరాటం