సంస్ధలో పనిచేసే ఉద్యోగులే యాక్సిస్ బ్యాంకు పేరును నాశనం చేశారని యాక్సిస్ బ్యాంకు ఎండీ, సీఈవో షీఖా శర్మ ఆదివారం పేర్కొన్నారు. ఖాతాదారుల లావాదేవీలను మరింత భద్రంగా నిర్వహించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అకౌంట్లలో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో పెరిగిన డిపాజిట్లపై కన్నేసి ఉంచుతున్నామని తెలిపారు. ఈ మేరకు యాక్సిస్ బ్యాంకు ఖాతాదారులందరికీ ఓ లేఖను రాసినట్లు వెల్లడించారు.