భారత్ పసిడి ఆభరణాల డిమాండ్ 2014లో 662.1 టన్నులుగా నమోదయ్యింది. 2013తో పోల్చితే ఇది ఎనిమిది శాతం ఎక్కువ. పసిడి దిగుమతులపై పలు ఆంక్షలు ఉన్నప్పటికీ డిమాండ్ పెరగడం విశేషం. 1995 నుంచీ చూసుకుంటే, ఒక్క ఆభరణాల కోసం ఇంత డిమాండ్ పెరగడం ఇదే మొదటిసారి. అయితే పెట్టుబడుల డిమాండ్ మాత్రం 50 శాతం పడిపోయింది. ఈ విలువ 180.6 టన్నులుగా నమోదయ్యింది. ఇది ఐదేళ్ల కనిష్ట స్థాయి.