WGC report
-
పదేళ్లలో ఇదే ప్రచండ బంగారం! కొత్త ఏడాదిలోనూ కొనసాగుతుందా?
ఈ ఏడాది ఇప్పటివరకు 30 శాతానికి పైగా పెరిగిన బంగారం ధరలు భారతీయ మార్కెట్లలో గ్రాముకు రూ. 7,300కి చేరుకున్నాయి. ఒక క్యాలెండర్ ఇయర్లో ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే గడిచిన 10 సంవత్సరాలలో ఈ ఏడాది పెరుగుదలే అత్యధిక కానుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తాజా నివేదిక వెల్లడించింది.అయితే ఆర్థిక, భౌగోళిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ స్థాయి పరుగు 2025 చివరి వరకు కొనసాగకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. 2024లో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరగడానికి కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు, పెట్టుబడిదారుల కొనుగోళ్లే కారణమని డబ్ల్యూజీసీ నివేదిక పేర్కొందిడబ్ల్యూజీసీ డేటా ప్రకారం.. 2022లో చూసిన స్థాయిలతో పోలిస్తే 2024 క్యాలెండర్ ఇయర్ మూడో త్రైమాసికం నాటికి బంగారం కొనుగోలు 694 టన్నులకు చేరుకోవడంతో సెంట్రల్ బ్యాంక్ డిమాండ్ బలంగా ఉంది. 2024 అక్టోబర్ నాటికి తుర్కియే, పోలాండ్ సెంట్రల్ బ్యాంకులు వరుసగా 72 టన్నులు, 69 టన్నుల బంగారు నిల్వలను జోడించి బంగారం మార్కెట్లో ఆధిపత్యం ప్రదర్శించాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్‌లో 27 టన్నులను జోడించింది. ఈ నెల వరకు దాని మొత్తం బంగారం కొనుగోళ్లు 77 టన్నులకు చేరుకున్నాయి. అక్టోబర్ వరకు భారత్ నికర కొనుగోళ్లు దాని 2023 కార్యకలాపాలపై ఐదు రెట్లు పెరిగాయని నివేదిక పేర్కొంది.వచ్చే ఏడాది ఎలా ఉంటుంది?2025 బంగారానికి సవాలుగా ఉండే సంవత్సరంగా చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే అనేక ఎదురుగాలులను వారు చూస్తున్నారు. వాటిలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, మార్కెట్లపై దాని ప్రభావం ఉన్నాయి. బంగారం అతిపెద్ద వినియోగదారులలో ఒకటైన చైనాలో కూడా పరిణామాలు కీలకంగా ఉన్నాయి. -
World Gold Council: గొలుసుకట్టు ఆభరణాల సంస్థలకు మంచి రోజులు
న్యూఢిల్లీ: భారత రిటైల్ ఆభరణాల మార్కెట్లో గొలుసుకట్టు ఆభరణ విక్రయ సంస్థల వాటా వచ్చే ఐదేళ్లలో 40 శాతానికి వృద్ధి చెందుతుందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది. 2021 చివరికే చైన్ స్టోర్లు రిటైల్ మార్కెట్లో 35 శాతం వాటాను సొంతం చేసుకున్నట్టు తెలిపింది. అంటే ఐదేళ్లలో మరో 5 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్టు తెలుస్తోంది. అగ్రగామి ఐదు రిటైల్ సంస్థలు వచ్చే ఐదేళ్లలో 800 నుంచి 1,000 వరకు ఆభరణాల విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తాయని డబ్ల్యూజీసీ తెలిపింది. భారత్‌లో జ్యుయలరీ మార్కెట్ నిర్మాణంపై ఓ నివేదికను బుధవారం విడుదల చేసింది. చిన్న, చిన్న విభాగాలుగా ఈ మార్కెట్ విస్తరించి ఉన్నందున, మొత్తం జ్యుయలరీ సంస్థలు ఎన్ని ఉన్నాయో కచ్చితంగా అంచనా వేయడం కష్టమని అభిప్రాయపడింది. పలు వాణిజ్య సంఘాల అంచనాల ప్రకారం భారత్‌లో 5–6 లక్షల వరకు జ్యుయలరీ విక్రేతలు ఉండొచ్చని పేర్కొంది. సానుకూలతలు.. వినియోగదారుల అనుభవం, వినూత్నమైన డిజైన్లు, హాల్ మార్కింగ్ పట్ల అవగాహన పెరగడం, మెరుగైన ధరల విధానం, సులభతర వెనక్కిచ్చేసే విధానాలు, జీఎస్టీ, డీమోనిటైజేషన్ ఇవన్నీ కూడా భారత్‌లో చైన్ జ్యుయలరీ స్టోర్ల వైపు కస్టమర్లు మొగ్గు చూపేలా చేసినట్టు డబ్ల్యూజీసీ వివరించింది. పెద్ద సంఖ్యలో విస్తరించి ఉన్న చిన్న ఆభరణాల విక్రేతలే ఇప్పటికీ మార్కెట్‌ను శాసిస్తున్నట్టు తెలిపింది. అయితే, గొలుసుకట్టు సంస్థల మార్కెట్ వాటా గత దశాబ్ద కాలంలో క్రమంగా పెరుగుతూ వస్తున్నట్టు వెల్లడించింది. ఈ పరిశ్రమలో సంఘటిత రంగం వాటా మరింత పెరిగేందుకు అవకాశాలున్నట్టు తెలిపింది. నిర్మాణాత్మక మార్పులు ‘‘భారత రిటైల్ జ్యుయలరీ మార్కెట్ గత దశాబ్ద కాలంలో ఎన్నో నిర్మాణాత్మక మార్పులను చూసింది. విధానపరమైన ప్రోత్సాహకాలు, కస్టమర్ల ధోరణిలో మార్పు దీనికి దారితీసింది. తప్పనిసరి హాల్ మార్కింగ్ ఈ రంగంలో అన్ని సంస్థలు సమాన అవకాశాలు పొందేలా వీలు కల్పించింది. పెద్ద మొత్తంలో రుణ సదుపాయాలు, పెద్ద సంఖ్యలో ఆభరణాల నిల్వలను కలిగి ఉంటే సానుకూలతలు జాతీయ, ప్రాంతీయ చైన్ స్టోర్లు మరింత మార్కెట్ వాటా పెంచుకునేందుకు మద్దతుగా నిలుస్తాయి’’అని డబ్ల్యూజీసీ రీజినల్ సీఈవో సోమసుందరం పీఆర్ తెలిపారు. చిన్న సంస్థలు మరింత పారదర్శకమైన విధానాలు అనుసరించడం, టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా పెద్ద సంస్థలతో సమానంగా పోటీ పడడమే కాకుండా, తమ మార్కెట్ వాటాను కాపాడుకోవచ్చని సూచించారు. ఆన్‌లైన్‌లోనూ ఆభరణాల విక్రయాలు పెరుగుతున్నాయని, 5–10 గ్రాముల పరిమాణంలో ఉన్నవి, లైట్ వెయిట్, రోజువారీ ధారణకు వీలైన 18 క్యారట్ల ఆభరణాల కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారని ఈ నివేదిక తెలిపింది. -
కరోనా కాలంలో పసిడికి భారీగా డిమాండ్
ముంబై: భారత్ బంగారం డిమాండ్ 2021 మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి) 37 శాతం (2020 ఇదే కాలంతో పోల్చి)పెరిగింది. పరిమాణంలో ఇది 140 టన్నులు. కోవిడ్ సంబంధ ఆంక్షలు పూర్తిగా తొలగిపోవడం, అంతర్జాతీయంగా ధరలు దిగిరావడం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. 2020 మొదటి త్రైమాసికంలో దేశ పసిడి డిమాండ్ 102 టన్నులు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) గురువారం ఈ మేరకు విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే.. విలువ రూపంలో చూస్తే, బంగారం డిమాండ్ 57 శాతం పెరిగి, రూ.37,580 కోట్ల నుంచి రూ.58,800 కోట్లకు చేరింది. ఆభరణాల డిమాండ్ 39 శాతం పెరిగింది. పరిమాణంలో ఇది 73.9 టన్నుల నుంచి 102.5 టన్నులకు ఎగసింది. విలువలో చూస్తే, 58 శాతం పెరిగి రూ.27,230 కోట్ల నుంచి రూ.43,100 కోట్లకు చేరింది. పెట్టుబడుల డిమాండ్ 34 శాతం పెరిగింది. పరిమాణంలో 28.1 టన్నుల నుంచి 37.5 టన్నులకు పెరిగింది. విలువలో 53 శాతం ఎగసి రూ.10,350 కోట్ల నుంచి రూ.15,780 కోట్లకు ఎగసింది. ఇక గోల్డ్ రీసైక్లింగ్ 20 శాతం పడిపోయింది. పరిమాణంలో 18.5 టన్నుల నుంచి 14.8 టన్నులకు చేరింది. మొదటి త్రైమాసికంలో నికర దిగుమతులు భారీగా 262 శాతం పెరిగి 83.1 టన్నుల నుంచి 301 టన్నులకు చేరాయి. కడ్డీలు, నాణేల డిమాండ్ భారీగా 34 శాతం పెరిగింది. 2015 తర్వాత ఈ స్థాయి పటిష్ట డిమాండ్ ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా 23 శాతం పతనం కాగా, అంతర్జాతీయంగా డిమాండ్ మార్చి త్రైమాసికంలో 23% పడిపోయింది. 2020 ఇదే కాలంతో పోల్చిచూస్తే పరిమాణం 1,059.9 టన్నుల నుంచి 815.7 టన్నులకు దిగింది. పసిడి ఈటీఎఫ్ నుంచి నిధులు బయటకు వెళ్లడం, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కొనుగోళ్లు అంతంతమాత్రంగా ఉండడం దీనికి ప్రధాన కారణం. పెట్టుబడుల డిమాండ్ 71 శాతం పడిపోయి, 549.6 టన్నుల నుంచి 161.6 టన్నులకు దిగింది. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు 124.1 టన్నుల నుంచి 95 టన్నులకు తగ్గింది. కాగా ఆర్బీఐ కొనుగోళ్లు 18 టన్నుల నుంచి 18.7 టన్నులకు ఎగశాయి. నడుస్తున్న త్రైమాసికం కష్టమే... ధర తగ్గడం, కోవిడ్ ఆంక్షల సడలింపుతోపాటు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కావడం మార్చి త్రైమాసికంలో పసిడి సెంటిమెంట్‌ను సానుకూలమైంది. వార్షికంగా చూస్తే, త్రైమాసికంలో సగటున 10 గ్రాముల పసిడి ధర 14 శాతం పెరిగి రూ.47,131గా ఉంది. అయితే సమీక్షా కాలానికి ముందు త్రైమాసికం (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) ధర 6 శాతం తగ్గింది. ధర గరిష్ట స్థాయిల్లో రూ.56,000 వద్ద ఉన్న ఆగస్టు 2020తో పోలి్చతే ధరల్లో తగ్గుదల ఏకంగా 16 శాతంగా ఉంది. రూ.50,000 దిగువకు పసిడి దిగిరావడంతో కొనుగోళ్లకు సంబంధించి వినియోగదారు సంసిద్ధత సానుకూలంగా మారింది. పెళ్లిళ్లు, పండుగల వంటి కార్యక్రమాలు డిమాండ్‌కు తోడయ్యాయి. ఇక పెట్టుబడులకు సంబంధించి పసిడి డిమాండ్ మెరుగుపడ్డం ఇది వరుసగా మూడవ త్రైమాసికం. పసిడిపై సుంకాల తగ్గింపు, రూపాయి బలోపేతం కావడం పసిడికి సానుకూల అంశాలుగా మారాయి. అయితే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇంత మంచి ఫలితాలు ఉంటాయన్న విషయం అనుమానమే. కోవిడ్-19 సెకండ్‌వేవ్ పెరుగుదల, రాష్ట్రాల్లో స్థానికంగా లాక్డౌన్లు, వినియోగ డిమాండ్ పడిపోవడం వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఆయా అంశాల నేపథ్యంలో పెళ్లిళ్లకు బంగారం డిమాండ్ పడిపోయే అవకాశం ఉంది. వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతం అయ్యేంత వరకూ డిమాండ్‌పై అనిశ్చితి కొనసాగే వీలుంది. ఆయా పరిస్థితుల్లో 2021 సంవత్సరం మొత్తంగా డిమాండ్ ఏ స్థాయిలో ఉంటుందన్న అంశం చెప్పడం కష్టమే. - పీఆర్ సోమసుందరం, డబ్ల్యూజీసీ మేనేజింగ్ డైరెక్టర్, ఇండియా చదవండి: సామాన్యులకు ఊరట.. జీఎస్టీ తొలగింపు! -
కొండెక్కిన బంగారం..కొనుగోళ్లు డీలా!
ముంబై : బంగారానికి భారీ డిమాండ్ ఉండే భారత్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసంలో బంగారం డిమాండ్ ఏకంగా 36 శాతం పడిపోయింది. ధరల్లో ఒడిదుడుకులు, కరోనా మహమ్మారి వ్యాప్తితో దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఈ కాలంలో బంగారం డిమాండ్ 101.9 టన్నులకే పరిమితమైంది. తొలి క్వార్టర్లో ఆభరణాల డిమాండ్, బంగారంలో పెట్టుబడులకు డిమాండ్ సైతం తగ్గిందని, ఇది స్వర్ణానికి సవాల్‌తో కూడిన సంవత్సరంగా మారే అవకాశం ఉందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ నివేదిక స్పష్టం చేసింది. 2019 తొలి త్రైమాసంలో భారత్‌లో బంగారానికి డిమాండ్ నగదు రూపంలో రూ 47,000 కోట్లు కాగా ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్ (జనవరి-మార్చి)లో అది రూ 37580 కోట్లకు పడిపోయిందని ఈ నివేదిక పేర్కొంది. ధరలు పైపైకి..కొనుగోళ్లు డీలా.. ఇక గత ఏడాది ఇదే సమయంలో బంగారం ధరలు కస్టమ్స్ సుంకాలు, పన్నులు లేకుండా పదిగ్రాములకు రూ 29,555 కాగా ఈ ఏడాది మార్చి నాటికి పదిగ్రాముల పసిడి ఏకంగా 25 శాతం ఎగిసి రూ 36,875కు చేరిందని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ పీఆర్ సోమసుందరం చెప్పారు. అధిక ధరలు, ధరల్లో అనిశ్చితి, కరోనా మహమ్మారి వంటి పలు కారణాలతో ఈ ఏడాది తొలి త్రైమాసంలో భారత్‌లో గోల్డ్ డిమాండ్ గణనీయంగా తగ్గిందని ఆయన పేర్కొన్నారు. చదవండి : బంగారు పండగపై కరోనా పడగ మహమ్మారితో కుదేలు ఇక ఇదే కాలంలో ఆభరణాలకు డిమాండ్ సైతం 41 శాతం తగ్గిందని, రూపాయల్లో చూస్తే గత ఏడాది రూ 37,070 కోట్ల విలువైన ఆభరణాల విక్రయాలు జరగ్గా, ఈ ఏడాది తొలి మూడునెలల్లో అది 27 శాతం పతనమై రూ 27,230 కోట్లకు పడిపోయింది. ఏడాది ఆరంభంలో పసిడికి డిమాండ్, కొనుగోళ్లు బాగానే ఉన్నాయని, ఆ తర్వాత వెడ్డింగ్ సీజన్ కూడా ఆశాజనకంగానే మొదలైందని మార్చి ద్వితీయార్ధంలో కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ అమలుతో పసిడి మార్కెట్ భారీగా పతనమైందని సోమసుందరం చెప్పుకొచ్చారు. మరోవైపు పసిడిలో పెట్టుబడుల డిమాండ్ కూడా ఈ క్వార్టర్లో తగ్గుముఖం పట్టిందని తెలిపారు. -
ఆభరణాలకు రికార్డు స్థాయి డిమాండ్
-
ఆభరణాలకు రికార్డు స్థాయి డిమాండ్
⇒ 2014లో 662 టన్నులు ⇒ పెట్టుబడుల్లో వెనుకంజ ⇒ మొత్తంగా తగ్గిన డిమాండ్ ⇒ భారత్‌పై డబ్ల్యూజీసీ నివేదిక న్యూఢిల్లీ: భారత్ పసిడి ఆభరణాల డిమాండ్ 2014లో 662.1 టన్నులుగా నమోదయ్యింది. 2013తో పోల్చితే ఇది ఎనిమిది శాతం ఎక్కువ. పసిడి దిగుమతులపై పలు ఆంక్షలు ఉన్నప్పటికీ డిమాండ్ పెరగడం విశేషం. 1995 నుంచీ చూసుకుంటే, ఒక్క ఆభరణాల కోసం ఇంత డిమాండ్ పెరగడం ఇదే మొదటిసారి. అయితే పెట్టుబడుల డిమాండ్ మాత్రం 50 శాతం పడిపోయింది. ఈ విలువ 180.6 టన్నులుగా నమోదయ్యింది. ఇది ఐదేళ్ల కనిష్ట స్థాయి. అంటే అటు ఆభరణాలకు, ఇటు పెట్టుబడులకు కలిపి 2014లో భారత్ మొత్తం డిమాండ్ పరిమాణం 842.7 టన్నులు. 2013లో ఈ పరిమాణం 974.8 టన్నులు. కాగా చైనాతో (813.6 టన్నులు) పోలిస్తే భారత్ డిమాండ్‌లో మొదటిస్థానంలో ఉంది. దీనితో ఈ విషయంలో ప్రపంచంలోనే భారత్ తొలి స్థానంలో నిలిచినట్లయ్యింది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే, 2015లో కూడా ఆభరణాలకు డిమాండ్ పెరుగుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తన తాజా నివేదికలో అభిప్రాయపడింది. మరిన్ని అంశాల్లోకి వెళితే... ⇒ 2014లో బంగారం దిగుమతులు 769 టన్నులు. 2013లో ఈ పరిమాణం 825 టన్నులు. అయితే వార్షికంగా పసిడి అక్రమ రవాణా దాదాపు 175 టన్నులు ఉంటుందని అంచనా. ⇒ పరిశ్రమలు, డెకరేటివ్ అప్లికేషన్స్ వంటి విభాగాల్లో పసిడి వినియోగం 2014లో ఆరుశాతం తగ్గింది. ఐదేళ్ల కనిష్ట స్థాయి 87.5కి ఈ పరిమాణం పడిపోయింది. ⇒ పట్టు వంటి వస్త్రాల్లో జరి దారం వినియోగం ఏయేటికాయేడు తగ్గుతూ వస్తోంది. మారుతున్న వినియోగదారుల అభిరుచికి ఇది అద్దం పడుతోంది.