కేంద్ర ప్రభుత్వం శనివారం మరోమారు పెట్రోల్ బాంబు పేల్చింది. లీటర్ పెట్రోల్ ధర రూ. 2.35 పైసలు పెంచగా, లీటరు డీజిల్ ధర 50 పైసలు వరకు పెరిగింది. పెంచిన పెట్రోల్ కొత్త ధరలు ఈ అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. పెట్రోల్ ధర పెంచేందుకు ఆయిల్ కంపెనీలకు అనుమతినిచ్చి ప్రజలపై భారం మోపింది. దీంతో పెట్రోల్ వాహనదారులందరిపై పెనుభారం పడనుంది. పెట్రల్ ధరను లీటరుకు రూ.2.35 పైసలు పెంచాలని ప్రభుత్వం ఆధ్వర్యంలోని సంస్థలు ఒత్తిడి తెస్తున్నాయి. రూపాయి విలువ పడిపోయినందున, ముడి చమురు ధరలు పెరిగినందు వల్ల పెట్రోల్ ధర పెంచాలని ప్రభుత్వ చమురు కంపెనీలు అడుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచనున్నట్టు తెలుస్తోంది.