తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు బుధవారం రసాభాసగా మారాయి. అధికార, ప్రతిపక్షాల సభ్యులు పరస్పరం తీవ్ర ఆరోపనలు చేసుకుంటూ.. వాగ్వాదానికి దిగటంతో స్పీకర్ ధనపాల్.. 89 మంది డీఎంకే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వీరిపై వారం రోజులపాటు వేటు వేయడం గమనార్హం.