తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళకే అన్నాడీఎంకే పార్టీ బాధ్యతలు కట్టబెట్టడం ఖాయమైంది. ‘బాధ్యతలు నాకొద్దు... నెమ్మదిగా సీనియర్ నేతను ఎన్నుకుందాం‘ అని శశికళ పైకిæ చెపుతున్నా... తెరవెనుక మాత్రం అందరినీ తన దారిలోకి తెచ్చుకుంటున్నారు. ఇందులో భాగంగా లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, పార్టీ సీనియర్ నేతలు, రాష్ట్ర మంత్రులు ఇలా ప్రతిఒక్కరూ చిన్నమ్మే(శశికళ) పార్టీ భారాన్ని మోయాలంటూ భజన మొదలుపెట్టారు. అమ్మ తర్వాత అంతటి సమర్థురాలు శశికళేనని... వేరే ప్రత్యామ్నాయం లేదని అంటున్నారు.