'10 వేల మంది ఉద్యోగులకు ఐపాడ్ లు' | ap-govt-to-give-ipads-to-employees | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 30 2014 4:50 PM | Last Updated on Fri, Mar 22 2024 10:46 AM

మూడేళ్లలో మొత్తం పాలనను ఆన్లైన్ చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 70 లక్షల మంది డ్వాక్రా మహిళలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించనున్నట్టు వెల్లడించారు. 10 మంది ఉద్యోగులకు త్వరలో ఐపాడ్ లు ఇస్తామన్నారు. అక్టోబర్ 20 వరకు ఉద్యోగుల బదిలీలు ఉండవన్నారు. అక్టోబర్ 2 నుంచి ఫించన్ లబ్దిదారుల జాబితాను ఆన్లైన్ లో పెడతామని చెప్పారు. ఫించన్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement