బ్యాంకు ఏటీఎంలలో పెట్టాల్సిన కోటీ 37 లక్షల రూపాయలతో పారిపోయిన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్ డోమినిక్ సెల్వరాజ్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టుచేశారు. బెంగళూరు కేఆర్ పురం ప్రాంతంలో అతడిని పట్టుకున్నారు. నవంబర్ 23వ తేదీన పోలీసులు బెంగళూరు వసంతనగర్ ప్రాంతంలో ఖాళీగా వదిలిపెట్టిన వ్యాను నుంచి రూ. 45 లక్షల నగదు, ఒక తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. దాంతో ఈకేసులో నిందితుడు సెల్వరాజ్ అని గుర్తించి.. అతడిని పట్టుకోడానికి ముమ్మరంగా గాలింపు మొదలుపెట్టారు.