ATM van driver
-
ఏటీఎం వ్యాన్‌లో చోరీ కేసులో ఒకరి అరెస్ట్
కడప అర్బన్: కడపలో ఏటీఎం వ్యాన్‌లోని డబ్బుల చోరీ కేసులో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కడపలో ఆదివారం ఎస్పీ అన్బురాజన్ ఈ కేసు వివరాలు చెప్పారు. ఖాజీపేట మండలం పుల్లూరు గ్రామానికి చెందిన చెన్నూరు మహబూబ్‌బాషా (36), కడపలోని సత్తార్ కాలనీకి చెందిన షేక్ ఉమర్ ఫరూక్ స్నేహితులు. ఇద్దరు కలిసి సులభంగా డబ్బులు సంపాదించాలని భావించారు. ఫరూక్ ఎస్బీఐ ఏటీఎంలలో నగదు లోడ్ చేసే సీఎంఎస్ కంపెనీ వ్యాన్‌కు గతంలో యాక్టింగ్ డ్రైవర్‌గా వెళ్లాడు. వ్యాన్ డ్రైవర్‌గా మళ్లీ అవకాశం వస్తే నగదు చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 16న ఫరూక్ యాక్టింగ్ డ్రైవర్‌గా వెళ్లాడు. అతను పథకం ప్రకారం ముందుగానే ఓ కారు అద్దెకు తీసుకుని వినాయక్‌నగర్ సమీపంలో పార్కింగ్ చేసి వెళ్లాడు. లోహియానగర్‌లోని ఏటీఎంలో సీఎంఎస్ సంస్థ ఉద్యోగులు నగదు లోడ్ చేసే సమయంలో ఫరూక్ వ్యాన్‌ను రివర్స్ చేసి పెట్టుకుంటానని చెప్పి అందులో మిగిలి ఉన్న రూ.56 లక్షలతో ఉడాయించాడు. వినాయక్‌నగర్ సమీపంలో సిద్ధంగా ఉంచిన కారులోకి డబ్బుల పెట్టెను మార్చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. వైవీయూ సమీపంలో వేచి ఉన్న మహబూబ్‌బాషా నగదు పెట్టెను పగులగొట్టి నగదును కారులో నింపి ఫరూక్‌ను బెంగళూరుకు వెళ్లాలని చెప్పాడు. సీఎంఎస్ కార్యాలయంలో ఏటీఎంకు కస్టోడియన్‌గా ఉన్న ఎం.సునీల్‌కుమార్ తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వ్యాన్‌కు ఉన్న జీపీఎస్ సహాయంతో వినాయక్‌నగర్ దగ్గర షెడ్డులో ఉన్నట్లు గుర్తించారు. కారులో పారిపోయిన ఫరూక్ సెల్ నంబర్, సీడీఆర్ డేటా, సీసీ కెమెరాలను పరిశీలించి కర్ణాటకలోని బాగేపల్లి టోల్‌గేటు వద్ద ఉన్నట్లు నిర్ధారించి అక్కడ ఉద్యోగులను అప్రమత్తం చేశారు. దీన్ని పసిగట్టిన ఫారూక్ టోల్‌గేటుకు కొంతదూరంలో కారును, నగదును వదిలేసి పారిపోయాడు. పోలీసులు వెళ్లి కారును, రూ.53.50లక్షలు స్వా«దీనం చేసుకున్నారు. చెన్నూరు మహబూబ్‌బాషాను ఆదివారం కడప నగర శివారులో అరెస్ట్ చేశారు. షేక్ ఉమర్ ఫరూక్ కోసం గాలిస్తున్నారు. -
నగదుతో ఏటీఎం వ్యాన్ డ్రైవర్ పరారీ!
బెంగళూరు: పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏటీఎంలో డబ్బు పెట్టాల్సిన వ్యాన్ డ్రైవర్లు డబ్బులతో పరారవుతున్నారు. వారం గడవకముందే కర్ణాటకలో మరో వ్యాన్ డ్రైవర్ శనివారం రూ.20 లక్షలతో ఉడాయించాడు. బెంగళూరు పోలీసులు ఆదివారం ఉదయం రెండు వేర్వేరు ప్రాంతాల్లో నగదును స్వాధీనం చేసుకుని, వ్యాన్ ను సీజ్ చేశారు. పోలీసు బృందాలు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. అసోంకు చెందిన సిబ్బిన్ హుసేన్(26) బెంగళూరులో సెక్యూర్ వాల్యూ ఇండియా అనే కంపెనీకి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆ కంపెనీ ఏటీఎంలకు డబ్బు తరలించే వ్యాన్లను ప్రొవైడ్ చేస్తుంది. ఈ క్రమంలో శనివారం బెంగళూరు శివారులోని మదివాలా ప్రాంతం నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు ఏటీఎం వ్యాన్ లో 52 లక్షలు పెట్టి పంపారు. కొరమంగళ లోని ఏటీఎంలో రూ.2లక్షలు నింపారు. ఆ తర్వాత విండ్ టన్నెల్ రోడ్డులో మరికొన్ని ఏటీఎంలలో 30 లక్షల నగదు పెట్టారు. ఉద్యోగులు నగదు నింపి వచ్చి చూసేసరికి డ్రైవర్ సిబ్బిన్ రూ.20 లక్షల నగదు ఉన్న వ్యాన్ తో పరారయ్యాడు. శనివారం రాత్రి కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం ఉదయం బెల్లాందుర్ జంక్షన్లో ట్రక్కును గుర్తించామని, రెండు ప్రాంతాల్లో కొంతమేర నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. డ్రైవర్ సిబ్బిన్ హుసేన్ కోసం గాలిస్తున్నట్లు ఓ పోలీస్ అధికారి వివరించారు. -
రూ. 1.37 కోట్లు కొట్టేసిన డ్రైవర్ ఇతడే!
-
రూ. 1.37 కోట్లు కొట్టేసిన డ్రైవర్ ఇతడే!
బ్యాంకు ఏటీఎంలలో పెట్టాల్సిన కోటీ 37 లక్షల రూపాయలతో పారిపోయిన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్ డోమినిక్ సెల్వరాజ్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టుచేశారు. బెంగళూరు కేఆర్ పురం ప్రాంతంలో అతడిని పట్టుకున్నారు. నవంబర్ 23వ తేదీన పోలీసులు బెంగళూరు వసంతనగర్ ప్రాంతంలో ఖాళీగా వదిలిపెట్టిన వ్యాను నుంచి రూ. 45 లక్షల నగదు, ఒక తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. దాంతో ఈకేసులో నిందితుడు సెల్వరాజ్ అని గుర్తించి.. అతడిని పట్టుకోడానికి ముమ్మరంగా గాలింపు మొదలుపెట్టారు. కేంద్రప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత కొత్త 2వేల రూపాయలు, 100 రూపాయల నోట్ల కోసం ఏటీఎంల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే లాగిక్యాష్ అనే సంస్థకు చెందిన వ్యాన్ డ్రైవర్ డొమినిక్ సెల్వరాజ్ మొత్తం రూ. 1.37 కోట్లతో పారిపోయాడు. దాంతో పోలీసులు అతడి తల్లిని కూడా ప్రశ్నించారు. రెండు నెలల క్రితమే తన కొడుకు భార్యతో కలిసి వేరు కాపురం పెట్టాడని, ఇప్పుడు లింగరాజపురం ప్రాంతంలో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడని ఆమె చెప్పారు. ఆ సమాచారం మేరకు ఆ ఇంట్లో సోదాలు చేయగా.. సెల్వరాజ్ భార్య వద్ద 79.8 లక్షల రూపాయలు దొరికాయి.