ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఉదయం గుజరాత్, రాజస్థాన్‌కు చెందిన బీజేపీ ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల గురించి ఆయన చర్చించారు. ఇంతకుమునుపు ఉత్తరప్రదేశ్ ఎంపీలతో ప్రధాని మోదీ ఇదేవిధంగా భేటీ అయి.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం, పార్టీ పనితీరు గురించి చర్చించిన సంగతి తెలిసిందే.