నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణం కర్నూలు జిల్లాకు తీరని లోటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. భూమా నాగిరెడ్డిపై మంగళవారం అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నాగిరెడ్డి మరణం బాధాకరమని అన్నారు.