ఎవరూ ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకోరు... మురికివాడల్లో పుడితే మురికి ఆలోచనలే వస్తాయి... కొడుకును కంటానంటే ఏ అత్తయినా వద్దంటుందా?... అంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తాజాగా ‘మీ కంటే మందు బాబులే బెటర్’ అంటూ ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఆయన గురువారం సచివాలయంలో వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్, సేవలు వంటి వివిధ రంగాలపై శాఖాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షులు కుటుంబరావు, సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ వంటి అధికారుల నుంచి ఆయా శాఖలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.