జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ కుమారుడు శౌర్యకు చెందిన ఓ సంస్థలో నలుగురు కేంద్ర మంత్రులు డైరెక్టర్లుగా ఉన్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. శౌర్యకు చెందిన ఇండియా ఫౌండేషన్ సంస్థలో కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, సురేశ్ ప్రభు, జయంత్ సిన్హా, ఎంజే అక్బర్‌లు సభ్యులుగా ఉన్నారని, ఇది పరస్పర విరుద్ద ప్రయోజనాలను పొందడమేనని ‘ది వైర్’ వెబ్‌సైట్ కథనం రాసింది.