జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్పై కేసు నమోదు చేయాలని నిజామాబాద్ కోర్టు డిచ్పల్లి పోలీసులను కోర్టు ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఓ న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో విచారణ జరపాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. నరేంద్ర మోడీని దూషిస్తే తాట తీస్తానంటూ కేసీఆర్ను హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కేసీఆర్ తాను చిటికేస్తే వెయ్యి తునకలవుతావంటూ పవన్పై విరుచుకుపడ్డారు.
Published Mon, Apr 28 2014 7:27 PM | Last Updated on Fri, Mar 22 2024 10:39 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement