ఉత్కంఠకు తెరదించుతూ... సీబీఐ డైరెక్టర్‌గా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ వర్మ(59)ను కేంద్ర ప్రభుత్వం గురువారం నియమించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలచేసింది. వర్మ నియామకానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్, లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గేలతో కూడిన త్రిసభ్య ఎంపిక కమిటీ అనుమతినిచ్చింది. అయితే సీబీఐలో వర్మ ఎన్నడూ పనిచేయలేదని అభ్యంతరం తెలుపుతూ జనవరి 16న జరిగిన కమిటీ సమావేశంలో ఖర్గే అసమ్మతి తెలియచేసినట్లు సమాచారం.