కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఏకగ్రీవం ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా ఎంపికైన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి విభజన అంశంలో హుందాగా వ్యవహరించలేదు అని తెలిపారు. పార్టీ విధేయుడిగానే కాకుండా పార్టీకి ఇబ్బంది లేకుండా వ్యవహరించారని దిగ్విజయ్ సింగ్ ప్రశసించారు. 'కిరణ్ తండ్రి కాంగ్రెస్‌కు నమ్మకస్తుడిగా పనిచేశారు. కిరణ్‌కుమార్‌ను మేం బహిష్కరించలేదు. కిరణ్ తిరిగి వస్తానంటే సాదరంగా ఆహ్వానిస్తాం' అని దిగ్విజయ్ తెలిపారు. టీఆర్‌ఎస్ విలీనంపై త్వరలో స్పష్టత వస్తుందన్నారు. కొత్త సీఎం ఎవరనేది త్వరలోనే తెలుస్తుంది ఓ ప్రశ్నకు సమాధనమిచ్చారు. కిరణ్ మినహా ఎవరూ స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు పంపలేదు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. తెలంగాణ బిల్లు ఆమోదానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అందరి సహకారం వల్లనే తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించింది అని దిగ్విజయ్ అన్నారు. వీలైనంత త్వరగా రాష్ట్ర విభజన జరగాలి అని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనపై అధికార ప్రకటన రాష్ట్రపతిపై ఆధారపడి ఉంది అని అన్నారు. హైదరాబాద్ యూటీ తప్ప అని హామీలను నెరవేర్చామని, అన్ని హామీలను ప్రధాని త్వరలోనే నెరవేర్చుతారని దిగ్విజయ్ తెలిపారు.