తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని దీని కారణంగా నైరుతీ రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ కేంద్ర డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు.