నగరంలో కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు శనివారం పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనను నిరసిస్తూ... సీపీఐ, సీపీఎం నేతలు, కార్యకర్తలు శనివారం రామవరప్పాడు జంక్షన్ ఆందోళనకు దిగారు. ప్రత్యేక హోదాపై మాట తప్పిన వెంకయ్య గోబ్యాక్ అంటూ వారు నల్లజెండాలు చేతపట్టి పెద్ద పెట్టున్న నినాదాలు చేశారు.