తెలంగాణ ప్రభుత్వం, అధికార టీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి జేఏసీ చైర్మన్ కోదండరామ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా సంబోధిస్తూ టీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఏఐసీసీ చీఫ్ తో భేటీపై విమర్శలను తోసిపుచ్చారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు ప్రభుత్వం తనపై దాడిచేస్తున్నదని ఆరోపించారు.