దేశంలోని కమ్యూనిస్టు నాయకుల్లో కేసీఆర్ అగ్రగణ్యుడని మంత్రి కేటీఆర్ అన్నారు. కమ్యూనిస్టులు చేయాల్సిన పనులను కేసీఆర్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రూ.40 వేల కోట్లను పేదల కోసం కేటాయించామని చెప్పారు. పేదలకు, వృద్ధులకు రూ.5,300 కోట్లతో పింఛన్లు ఇస్తున్నామన్నారు. ఎవరు అడగకున్నా సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. సీఎం మనవడు, మనవరాలు తినే బియ్యం రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తున్నామన్నారు.