న్యాయమూర్తుల నియామక అంశంపై న్యాయవ్యవస్థ, కేంద్రప్రభుత్వం మధ్య వివాదం ముదురుతోంది. జడ్జీల నియామకంలో జరుగుతున్న జాప్యంపై భారత ప్రధాన న్యాయమూర్తి(సీఐజే) జస్టిస్ టీఎస్ ఠాకూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారమిక్కడ జరిగిన జాతీయ రాజ్యాంగ దినోత్సవ’ సదస్సులో జస్టిస్ ఠాకూర్ మాట్లాడారు. ‘ప్రస్తుతం హైకోర్టుల్లో 500 జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నారుు. ఇప్పటికే ఆ నియామకాలు పూర్తి కావాల్సి ఉంది. కానీ వాటిపై ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు. దేశంలో న్యాయమూర్తులు లేని కోర్టులు అనేకం ఉన్నారుు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నారుు. ఈ సంక్షోభాన్ని త్వరలోనే కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు.