కాపు రిజర్వేషన్ల హామీని వచ్చే నెల 7లోగా నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే అదేరోజు కాపు జేఏసీతో సమావేశమవుతామని తెలిపారు. కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు చర్చలకు ఆహ్వానిస్తే తమ తరపున ఐదుగురిని పంపిస్తామన్నారు. వచ్చే 7 నుంచి కాపు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రకటించారు.