సైకిల్ దిగి కమలం చేతబట్టిన నాగం జనార్దన్ రెడ్డి.. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి దూరం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఆపార్టీలో నాగం జనార్థన్ రెడ్డికి ప్రాధాన్యత తగ్గుతుండటంతో ఆయన బీజేపీని వీడేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి మధ్య దూరం కూడా మరింత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా కిషన్ రెడ్డి చేపట్టిన పాలమూరు జిల్లా పర్యటనకు నాగం దూరంగా ఉన్నారు.