దేశంలోనే అతిపెద్దదైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార సమాజ్‌వాదీ పార్టీని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈసారీ గెలవాలని పట్టుదలగా ఉన్న రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్‌కు సొంతింట్లో కుంపటి తలనొప్పిగా మారింది. కొంత కాలంగా కుమారుడు(అఖిలేశ్), తమ్ముడు (శివ్‌పాల్) మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న భేదాభిప్రాయాలు ఇప్పుడ రోడ్డున పడటం ములాయంకు ఇబ్బందిగా మారింది.