ముంబై ఉగ్రదాడిలో కీలక సూత్రధారి, పాక్ ఉగ్రవాది, జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్సు గట్టి ఝలక్ ఇచ్చింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం (ఏటీఏ) నాలుగో జాబితాలో అతని పేరును శనివారం చేర్చింది. పాక్ ప్రభుత్వం ఆదేశాల మేరకు హఫీజ్ నిర్వహించే సంస్థలను కూడా ఈ జాబితాలో చేర్చినట్లు పాక్ మీడియా వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం.. ఉగ్రవాదిగా అనుమానమున్న వ్యక్తులపై నిఘా ఉంచుతారని తెలిపింది.