ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. హఫీజ్ సయీద్ కార్యకలాపాలపై నిఘా తీవ్రతరం కావడంతో సంస్థ డిప్యూటీ మౌలనా అమీర్ హంజా.. కొత్త కుంపటికి తెరలేపారు. ‘జైషే మన్కాఫా’ పేరుతో మౌలానా కొత్త సంస్థను స్థాపించినట్లు పాక్ మీడియా పేర్కొంది.ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకే హఫీజ్ ఈ ఎత్తుగడ వేసి ఉంటాడని తెలుస్తోంది.