అత్యంత కీలకమైన పనామా పత్రాల కేసులో పాకిస్థాన్ సుప్రీంకోర్టు గురువారం తన తీర్పు వెలువరించనుంది. అక్రమ మనీలాండరింగ్ ద్వారా విదేశాల్లో ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబసభ్యులు ఆస్తులు కూడబెట్టారంటూ పనామా పత్రాల్లో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జగరనున్న నేపథ్యంలో ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు షరీఫ్, ఆయన పార్టీ పీఎంఎల్-ఎన్‌కు కీలకం కానుంది.