నల్లగొండ జిల్లా భువనగిరిలో దారుణం జరిగింది. చెల్లెలిపై అనుమానంతో ఓ యువకుడు సొంతవారిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కారు డ్రైవర్గా పనిచేస్తున్న కిరణ్... తల్లిదండ్రులు, చెల్లిపై కిరోసిన్ పోసి నిప్పటించాడు. ఆ తర్వాత అతడు కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వీరిని హుటా హుటిన భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. కొంతకాలంగా తన చెల్లెలు ఫోన్లో ఎక్కువ మాట్లాడుతుండడంతో కిరణ్ అనుమానం పెంచుకున్నాడు. ఈ రోజు తాను ఇంట్లోకి వచ్చే సరికి సోదరి ఫోన్లో మాట్లాడుతూ కనబడడంతో అతడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఫోన్ విసిరికొట్టి చెల్లెలిపై కిరోసిన్ పోశాడు. అడ్డొచ్చిన తల్లిదండ్రులపై కూడా కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అయితే చెల్లెలికి పెళ్లి కావడం లేదన్న నిస్పృహతో అతడీ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది.