పవన్ కళ్యాణ్ రాజకీయ అభిప్రాయాలను కట్టడి చేయలేనని ఆయన సోదరుడు, కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు. తమ్ముడిగా పవన్‌కు తన ఆశీస్సులు ఉంటాయని, రాజకీయంగా మాత్రమే తనకు ప్రత్యర్థి అని చెప్పారు. కాంగ్రెస్ను విమర్శించేవారంతా తమకు ప్రత్యర్థులే అన్నారు. సోదరుల్లో రాజకీయ భేదాభిప్రాయం తప్పేమీ కాదన్నారు. ఈ అంశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగానే చూడాలన్నారు. పవన్ కళ్యాణ్ తనను సవాల్ చేస్తే లక్షలాది మంది తమ్ముళ్లు తన వెనుక ఉన్నారని దీమా వ్యక్తం చేశారు. పవన్ లాంటి తమ్ముళ్లు తనకు లక్షలాది సంఖ్యలో ఉన్నారని చెప్పారు.