ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మన్ పార్లమెంటు భద్రత వీడియోను చిత్రీకరించి సామాజిక మాధ్యమంలో పోస్టు చేయటంపై శుక్రవారం పార్లమెంటు ఉభయ సభల్లో తీవ్రగందరగోళం నెలకొంది. పార్లమెంటు భద్రతపై తీసిన వీడియో వివాదాన్ని సీరియస్‌గా తీసుకుని మన్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని పార్టీలన్నీ డిమాండ్ చేశాయి. అయితే.. ఆప్ ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై అన్ని పార్టీలను సంప్రదిస్తామని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు.తను తీసిన వీడియో దుమారం రేపుతుండటంత మన్ బేషరతు క్షమాపణ కోరారు.