రియల్టర్లను వదిలేసి భారత ప్రధాని నరేంద్రమోదీ పేద ప్రజలపై పడ్డారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మండిపడ్డారు. డిపాజిట్ చేసిన సొమ్మంతా బ్లాక్ మనీ కాదని, అదంతా నగదు రూపంలో లేదని అన్నారు. శుక్రవారం సాయంత్రం గోవాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన మోదీపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత సామాన్య జనం పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని అన్నారు.