ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీకి సంబంధించిన వ్యక్తిగత సమాచారం తన వద్ద ఉందని, ఆ సమాచారాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టనివ్వకుండా తనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడ్డారని, ఆ సమాచారం తనవద్ద ఉండటంతో ఆయన భయకంపితులవుతున్నారని అన్నారు. మోదీ అవినీతిని బయటపెట్టనివ్వకుండా తనను అడ్డుకుంటున్నారని తీవ్ర ఆగ్రహంగా పేర్కొన్నారు. నోట్ల రద్దుతో ఆయన లక్షలాది మంది ప్రజల ఉపాధిని ధ్వంసం చేశారని, ఇందుకుగాను ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.