జీఎస్టీ (వస్తు సేవల పన్ను) అమలుతో రాష్ట్రంలో దాదాపు 60 వేల మందికిపైగా వ్యాపారులకు ఊరట లభించనుంది. ప్రస్తుతం వ్యాట్ చెల్లిస్తున్న వీరందరూ జీఎస్టీ అమల్లోకి వచ్చాక.. జీరో ట్యాక్స్ (పన్ను వర్తించని) పరిధిలో చేరనున్నారు. వ్యాట్, సీఎస్‌టీ, సేల్స్ ట్యాక్స్, సర్వీసు ట్యాక్స్‌లన్నింటి బదులుగా ఈ ఏడాది జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. వ్యాట్‌తో పోలిస్తే జీఎస్టీ కనిష్ట టర్నోవర్ పరిమితిని పెంచటంతో చిన్న వ్యాపారులకు ఉపశమనం లభించనుంది. ప్రస్తుతం ఏడాదికి రూ.7.5 లక్షల టర్నోవర్ దాటిన అన్ని వ్యాపారాలు, ఉత్పత్తులు, సేవలపై వ్యాట్ అమల్లో ఉంది.