ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఏర్పాటయిన నలుగురు సభ్యుల కమిటీ కాంగ్రెస్ పార్టీ కమిటీ, ప్రభుత్వ కమిటీనా అనేది కేంద్రం స్పష్టం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ కమిటీ అధికారికంగా ప్రకటించారు కాబట్టే అన్ని పార్టీలు తమ అభిప్రాయాలు కమిటీకి చెప్పాయని గుర్తు చేశారు. ఏకే ఆంటోనీ కమిటీ ప్రభుత్వ కమిటీ అయితే అన్ని పార్టీలు తమ వైఖరి స్పష్టం చేస్తాయన్నారు. సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ డైరెక్షన్లో పనిచేస్తున్నారని శోభా నాగిరెడ్డి ఆరోపించారు. సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతుందని భావించి సీఎం మీడియా ముందుకు వచ్చారని అన్నారు. విభజనకు వైఎస్ బీజం వేశారంటూ సీఎం మాట్లాడటం దారుణమన్నారు. ఒకవేళ వైఎస్సే విభజన చేయాలనుకుంటే .. ఆపని ఎప్పుడో చేసేవారని చెప్పారు. వైఎస్‌ఆర్‌లాంటి బలమైన నాయకుడు వల్లే విభజన జరగలేదని ప్రతి సామాన్యుడికి తెలుసునని అన్నారు. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే వైఎస్సార్పై సీఎం కిరణ్ నిందలు వేస్తున్నారని అన్నారు. విభజన ప్రకటన ముందే కిరణ్ స్పందించాల్సివుందన్నారు. జగన్ను రాజకీయంగా ఎదుర్కొలేకే కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతలంతా రాజీనామాలు చేసి సంక్షోభం సృష్టించివుంటే పార్టీ నిర్ణయం తీసుకునేదా అని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు.
Published Fri, Aug 9 2013 4:04 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement