వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం మానాజీపేట.. గురువారం ఉదయం.. గొల్ల రాజ మ్మ అనే మహిళ చట్నీ కోసం టమాటాలు, మిరపకా యలు ఉడికించింది. చట్నీ నూరేందుకు ఇంట్లోని పెద్ద రోట్లో వాటిని పోసి రోకలితో గట్టిగా నూరింది. అయి తే, అప్పటికే అందులో ఓ పాము పడుకుని ఉంది. దాన్ని గమనించని రాజమ్మ రోకలి దెబ్బలేసింది.