కృష్ణా జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్థరాత్రి కంచికచర్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నంబర్ ప్లేట్పై అనుమానం వచ్చి స్కార్పియో వాహనాన్ని పోలీసులు ఆపారు. దాంతో డ్రైవర్ కారును వదిలేసి పరారైయ్యాడు. పారిపోయే సమయంలో సదరు డ్రైవర్ చేతిలో తుపాకీ ఉందని స్థానికులు వెల్లడించారు.